సాయి ప్రియ కాలనీ పెద్దమ్మ తల్లి & గణేష్ ఉత్సవ్ సొసైటి(Reg no.671/2023)

సాయి ప్రియ కాలనీ వాసులకు హృదయపూర్వక నమస్కారము నేను ఆకుల కమలాకర్ 2017 నుంచి కాలనీలో నివాసం ఉంటున్నాను. గత సంవత్సరం సెప్టెంబర్ 2022 లో కాలనీ అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో సాయి ప్రియ కాలనీ డెవలప్మెంట్ అసోసియేషన్ ( SPCDA ) వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. గత సంవత్సరం దసరా ,దీపావళి సమయంలో కాలనీలో ఉన్న రోడ్లలో ( 1 నుండి 6 వరకు ) మొరం పొడించడం జరిగింది మరియు ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న రోడ్ నెంబర్ 5 నీ మొరం పోయించి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే రోడ్ నెంబర్ త్రీ లో ఉన్న పార్క్ స్థలం కూడా మొరం పోయించి అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత పెద్ద కాలనీలో టెంపుల్స్ లేనందు వల్ల టెంపుల్స్ అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో సాయి ప్రియ కాలనీ పెద్దమ్మ తల్లి & గణేష్ ఉత్సవ సోసైటీ ( Registration number 671/2023 ) పేరు మీద కమిటీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.

Comments